ఓ రెస్టారెంట్‌లో ఇంట్రడక్షన్.. పెళ్లి వరకు లవ్ జర్నీ
ఓ చిన్న రెస్టారెంట్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి జీవితాంతం తోడుగా నిలిచిన అనుబంధం! మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తన ప్రేమ జ్ఞాపకాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి గుర్తుచేసుకున్నారు. ప్రేమ, నవ్వులతో నిండిన తమ జీవితంలోని మధుర క్షణాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు.
నవంబర్ 10న విడుదల కానున్న తన ఆత్మకథ (Autobiography) నేపథ్యంలో సోనియా గాంధీ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజీవ్ గాంధీతో తనకున్న అనుబంధం, ప్రేమ జ్ఞాపకాలను ఆమె మరోసారి గుర్తుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుతో సోనియా గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి (Love Memories).