రోస్టర్ కేటాయింపులో మాలలకు అన్యాయం

24-10-2026 | 06:12pm

బోథ్ అక్టోబర్ 24 (విజయక్రాంతి): రోస్టర్ కేటాయింపులో(Roster Allocation) మాలలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం వెంటనే 20 లోపు ఒక రోస్టర్ పాయింట్ను మాలలకు కేటాయించాలని మాల శీను(Mala Seenu) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు స్థానిక తహసిల్దార్ సుభాష్ చంద్రకు(Tehsildar Subhash Chandra) వినతి పత్రం అందించారు.

ఎస్సీ వర్గీకరణ అనంతరం రోస్టర్ కేటాయింపులు అన్యాయం జరిగిందని ఈ విషయమై ప్రభుత్వం ఘన పరిశీలించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో(Comprehensive Household Survey) సామాజిక ఆర్థిక విద్య(Financial Education) ఉద్యోగ రాజకీయ  సంబంధిత గణాంకాలను పరిగణలోకి తీసుకొని వాస్తవ పరిస్థితి లకు అనుగుణంగా రోస్టర్ కేటాయింపులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మాల సామాజిక హక్కులను విస్మరిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుచులాపూర్ సర్పంచ్,నారాయణ, పశుల,చంటి, కందిప్రవీణ్, కూర్మ గంగాధర్,కొలప్రశాంత్, నాగార్జున,సాగర్, కుర్మే జానీ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు