ప్రతి రైతు వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మించుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

24-10-2026 | 05:49pm

భిక్కనూర్, అక్టోబర్‌ 24 (విజయక్రాంతి): నీటి సంరక్షణతో(Water Conservation) పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు(Farmers') ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(District Collector Ashish Sangwan) సూచించారు. శనివారం భిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డిలో వి.బి.-జీ రామ్‌ జీ పథకం(V.B.-G. Ram Ji Scheme) కింద చేపట్టిన వ్యక్తిగత వ్యవసాయ క్షేత్ర(Agricultural fields) చెరువు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రతి రైతు తన పొలంలో చెరువు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, పంటలకు సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు.

గ్రామానికి చెందిన రైతు సింగిని భిక్షపతి తన రెండెకరాల భూమిలో చెరువు నిర్మాణం చేపట్టడాన్ని కలెక్టర్‌ అభినందించారు. అనంతరం కూలీలతో మాట్లాడి పని దినాలు, వేతనాల చెల్లింపులు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెరువు పరిమాణం, లోతును పరిశీలించారు. నీటి సంరక్షణ పనులతో పాటు ఉపాధి అవకాశాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.వై. గిరి, డీఆర్‌డీఓ దామోదర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ సవితారెడ్డి, ఏడీఏ అపర్ణ, సర్పంచ్‌ సాయాగౌడ్‌, ఉప సర్పంచ్ చైతన్య కొండల్రెడ్డి  సహకార సంఘం చైర్మన్‌ రాజాగౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు