శనేశ్వరునికి వైభవంగా శని త్రయోదశి పూజలు
వేలాదిగా పాల్గొన్న భక్తులు
బిజినేపల్లి, అక్టోబర్24 : మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో(Nandi Vaddeman Village) శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనేశ్వర స్వామికి(Lord Shaneshwara) ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో(Devotional) భక్తుల(devotees) చేత శని గ్రహ దోష నివారణకు తిల తైలాభిషేకాలు నిర్వహించారు. జైష్ట్యా మాతా సమేత శనేశ్వర స్వామికి భక్తులు(devotees) అర్థాష్టమ, అష్టమ, ఏలినాటి శని గ్రహ దోష నివారణకు శనివారం నాడు భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు.
అనంతరం గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం పరమ శివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖరచారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, శనేశ్వర స్వామి వారి సేవకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.