కుంటను కమ్మేసి అక్రమంగా కన్వేన్షన్ హాల్ నిర్మాణం.!

23-11-2026 | 04:15pm

సర్వే నంబర్లు 316, 323లో కబ్జాలంటూ ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు. 

నాగర్‌ కర్నూల్  (విజయక్రాంతి): భావితరాలకు జీవన ఆధారంగా ఉన్న కుంటలను చదును చేసి అక్రమంగా కన్వెన్షన్ హాల్(Illegal convention hall) నిర్మించిన వ్యక్తులపై అనుమతులిచ్చిన ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కేతపల్లి శంకర్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. నాగర్‌ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర పేరుతో ఉన్న  సర్వే నంబర్లు 316, 323 పరిధిలో కుంటలు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

1919 నాటి గ్రామ నక్షాలో కుంటల ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ ఎన్‌ఓసీ లేకుండానే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ముడుపులకు కక్కుర్తి పడి అనుమతులు జారీ చేశారని పేర్కొన్నారు. సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు