వినాయక నిమజ్జనంలో డీజేలకు నో..
18-09-2026 | 11:14pm
-డీజే నిర్వాహకులతో పోలీసుల సమావేశం
టేకులపల్లి, (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా డీజేలను నిషేధిస్తున్నట్లు టేకులపల్లి పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు డీజే నిర్వాహకులతో టేకులపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ(Circle Inspector Bathula Satyanarayana) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని డీజే నిర్వాహకులకు సీఐ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సమావేశంలో టేకులపల్లి ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.