కోరికలు తీర్చే శక్తి స్వరూపుడు... కన్నెమూల గణపతి
ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం.
సర్వం గణపతి మయం... లంబోదర ప్రియం.
జవహర్ నగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కోరికలు తీర్చే శక్తి స్వరూపుడు ఆ కన్నెమూల మహాగణపతియే అని ఆదిత్య హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దమ్మాయిగూడ ఆదిత్య హాస్పిటల్(Aditya Hospital) వారి సౌజన్యంతో శుక్రవారం మహా గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రవీణ్ హాజరై మాట్లాడుతూ లోకంలో మహిమాన్వితమైన మహిమ గల దేవుడు ఆ ఆదిమూల మహా గణపతియేనని, ప్రతి ఏడాది గణనాధుని ఉత్సవాలలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కోరికలు తీర్చే కొంగు బంగారం లాంటి దేవుడు ఆ గననాధుడే అని అన్నారు.
కన్నెమూల మహాగణపతిని వేడుకుంటే ఎన్ని కష్టాలైనా తీరుతాయని మహిమగల మహి మాన్వితమైన ఆదిమూల మహాగణపతిని పూజించడం శుభకరం ప్రీతికరమన్నారు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది సహకారంతో పెద్ద ఎత్తున హాస్పిటల్ పరిసర ప్రాంతంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్, కార్తీక్, హాస్పిటల్స్ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు.