ఎస్.జి.ఎఫ్.ఐ జోనల్ క్రీడల్లో సంస్కార్ పాఠశాల విద్యార్థుల సత్తా

18-09-2026 | 11:12pm

23 మంది విద్యార్థులు ఎంపిక

పాఠశాల కరస్పాండెంట్ బీరం వెంకటేశ్వర్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 18(విజయక్రాంతి): స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGFI) ఆధ్వర్యంలో దుండిగల్ లో నిర్వహించిన 70 వ మేడ్చల్ జోనల్ స్థాయి పోటీలలో సంస్కార్ ఇన్నోవేటివ్ స్కూల్(Sanskar Innovative School) విద్యార్థులు అధ్బుతమైన ప్రతిభను కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ బీరం వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో కోకో, కబడ్డీ, వాలీబాల్, క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి పాఠశాలకు మంచి ఘనతను తీసుకువచ్చారని ఆయన కొనియాడారు.

పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అండర్ 17 కోకో బాలుర విభాగంలో గణేష్, లక్ష్మణ్ కుమార్,ప్రణీత్ కుమార్, అవినాష్, అండర్ 14 కోకో బాలుర విభాగంలో చంద్రశేఖర్,ప్రణవ్,అండర్ 14 కోకో బాలికల విభాగంలో రాధిక, దర్శిక, అండర్ 17 కోకో బాలికల విభాగంలో మహాలక్ష్మి,అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో మహేష్ కుమార్,యశ్వంత్,వికాస్ నాయక్, అండర్ 14 వాలీబాల్ బాలుర విభాగంలో సాత్విక్,అతునో,శ్రీనీత్ రెడ్డి,అండర్17 కబడ్డీ బాలుర విభాగంలో ప్రణీత్ కుమార్, త్రిలోక్ రెడ్డి, సుశాంత్, అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో ఎం మహాలక్ష్మీ,అండర్ 14 కబడ్డీ బాలుర విభాగంలో దూరంత్ కోచ్,వర్షిత్ రాజ్,అండర్ 14 కబడ్డీ బాలికల విభాగంలో గౌతమి,లు విజయం సాధించడం జరిగిందని వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.

జోనల్ క్రీడల్లో అన్ని విభాగాలలో కలిపి 23 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికైన విద్యాఎత్తులు,విద్యార్థుల విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు నరేంద్ర బాబు,మల్లారెడ్డిలను ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల కరస్పాండెంట్ బీరం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం పాఠశాల సమగ్ర విద్యా విధానానికి నిదర్శనమని పేర్కొంటూ "క్రీడలే ఆరోగ్యానికి పునాది క్రీడా ప్రతిభే విద్యార్థుల వికాసానికి బాట"అనే లక్ష్యంతో సంస్కార్ ఇన్నోవేటివ్ స్కూల్ విద్యార్థులను ప్రోత్సహిస్తుoదన్నారు.

అదేవిధంగా హిందూ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్-స్కూల్ వాలీబాల్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన సంస్కార్ ఇన్నోవేటివ్ స్కూల్ విద్యార్థుల జట్లను ఆయన ప్రశంసించారు.అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్-స్కూల్ పోటీలలో అండర్14తో పాటు అండర్17 వాలీబాల్ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించిన రెండు జట్లను కూడా వెంకటేశ్వర రెడ్డి అభినందించారు.ఇలా కేవలం ఇటీవల రెండు నెలల వ్యవధిలోనే వివిధ క్రీడా పోటీలలో తొమ్మిది బహుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో  విద్యార్థులను భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు