ముప్పనపల్లి సహాయనిధి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- 54 మంది రక్తదాతల సహాయం మరువలేనిది
- ముప్పనపల్లి సహాయనిధి వాట్సాప్ గ్రూప్ అధ్యక్షులు అబ్బు సతీష్
కన్నాయిగూడెం, అక్టోబర్ 08(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి(mega blood donation camp) విశేష స్పందన వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముప్పనపల్లి సహాయనిధి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, తలసేమియా, డయాలసిస్ పేషెంట్స్ కోసం గురువారం రోజున రైతు వేదికలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.
మెగా రక్తదాన శిబిరానికి యువత, పార్టీలకు అతీతంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. గురువారం రోజున నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 54మంది స్వచ్ఛంధంగా రక్తదాతలుగా నిలిచారు. మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛంధంగా రక్తదానం చేసిన రక్తదాతల సేవలు మరువలేనివని అధ్యక్షులు అబ్బు సతీష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి ముంజ మహేష్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు డాక్టర్ ప్రణీత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి రాంబాబు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొల్లె భాస్కర్, బీసీ జేఏసీ మండల అధ్యక్షులు ముదురుకోళ్ల బిక్షపతి, పూజారి కిషోర్,మఠం వెంకటేష్, లక్ష్మిపురం సర్పంచ్ అగ్గు రోజా వెంకటేష్,ముప్పనపల్లి ఉప సర్పంచ్ చిదరి సుమన్,తాడూరి శ్రీధర్, అబ్బు రమేష్,
అబ్బు వెంకటనర్సయ్య, మరికాల వెంకటేష్ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు, కావిరి చిరంజీవి,పంతంగి నాగరాజు, గడ్డం రాజబాబు, వాసంపల్లి రమేష్, సునార్కాని మల్లేష్ మరియు ముప్పనపల్లి సహాయనిధి సభ్యులు నామని రాజేష్, కంచె రమేష్, తిప్పనపల్లి విజయ్, రాజు, వెలగందుల నాగరాజు, తడకల రాణాప్రతాప్, వంగర రాజు, కల్వచర్ల నవీన్ మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.