చెడ్డగా ఏమీ లేదిక్కడ!

29-09-2026 | 05:35am

దినేశ్ తేజ్, దష్విక కే(Dinesh Tej, Dashvika K) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’. ఈ చిత్రానికి అర్జున్ కోల(Arjun Kola) దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటీ నిర్మించారు. అక్టోబర్ 2న థ్రియేటర్ల ద్వారా విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయిక దష్విక కే(Heroine Dashvika K) పాత్రికేయులతో పంచుకుంది. “ఇది నా తొలిసినిమా.. హీరోయిన్‌గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్న టైమ్‌లో ఈ అవకావం వచ్చింది. గతంలో నేను హీరో విజయ్ దేవరకొండతో(Vijay Deverakonda) కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించాను.

ఇవి కూడా చదవండి:  జెన్‌జీ రిలేషన్‌షిప్స్‌ను చర్చించే రోమియో జూలియట్

ఫస్ట్ ప్రాజెక్టులోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథ వినగానే ఆసక్తికరంగా అనిపించింది. ఇలాంటి కథలు మలయాలంలో ఎక్కువగా వస్తుంటాయి. తెలుగులోనూ ఇలాంటి కథతో సినిమా రావడం ఆనందంగా అనిపించింది. ఇది మర్డర్ మిస్టరీ సస్పెన్స్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భావోద్వేగభరితమైన పాత్ర నాది. నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటుంది. కానీ అందరికీ నచ్చే పాత్రే. వ్యక్తిగతంగా నేను కూడా సిగ్గరిని కాబట్టి ఈ సినిమాలో నా పాత్రకు సహాయపడింది. కిల్లర్ అన్వేషణలో హీరోకు అండగా ఉండే పాత్ర నాది.

చిన్నప్పటి నుంచి నాకు నటనంటే ఇష్టం. మూడో తరగతిలోనే నేను నటిని అవుతానని మా టీచర్‌కు చెప్పాను. అమ్మానాన్న కోరిక మేరకు చదువు పూర్తి చేశాను. ఆ తర్వాతే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. సినిమాల్లోకి వచ్చే ముందు ఇండస్ట్రీ గురించి చెప్పిన మాటలు విని భయపడ్టాను. అయితే ఏ ఫీల్డ్‌లో అయినా మనం మేనేజ్ చేస్తూ ఎదగాల్సిందేనని అర్థమయింది.. నా విషయంలో అంతా ప్రశాంతంగా జరిగింది.

బయట అనుకున్నంత చెడ్డగా ఏమీ లేదిక్కడ. నాకు అన్ని తరహా పాత్రలు ముఖ్యంగా లవ్‌స్టోరీస్ చేయాలని ఉంది. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటాను. ఇక నా తదుపరి సినిమాల గురించి చెప్పాలంటే.. నవంబర్‌లో తమిళ సినిమా ఒకటి ప్రారంభమవుతుంది. తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి” అని తెలిపింది. 

మరిన్ని వార్తలు