మళ్లొచ్చే దీపావళికే స్పిరిట్

19-10-2026 | 05:15am

రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ, తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా మారిన విడుదల తేదీని ప్రకటించారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తాజా పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిలమ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు