ఫుల్ మాస్ అవతారంతో రష్మిక

02-11-2026 | 08:14pm

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’(Pan-India film mysa) నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’(O Maisa Re Song) విడుదలైంది. ఈ సాంగ్‌లో రష్మిక ఎనర్జీ, అదిరిపోయే విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రవీంద్ర పుల్లె దర్శకత్వం(Ravindra Pulle Director)లో రూపొందుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ‘ఓ మైసా రే’ పాటలో పవర్‌ఫుల్ బీట్స్, ఉత్సాహభరితమైన సంగీతం ఆకట్టుకుంటున్నాయి. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం మహిళా శక్తి, ధైర్యం, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. సింధూజ శ్రీనివాసన్ గాత్రం పాటకు మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ పాటలో రష్మిక తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ, భారీ డ్యాన్సర్ల బృందం, అటవీ నేపథ్యంలోని విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా కోసం రష్మిక చేసిన కష్టం, యాక్షన్ పాత్ర కోసం చూపించిన అంకితభావం తెరపై కనిపిస్తున్నాయి.

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రష్మికతో పాటు ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తి పెంచగా.. తాజాగా వచ్చిన ‘ఓ మైసా రే’ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.


మరిన్ని వార్తలు