రణబాలి టీజర్ ఊరమాస్..!
09-09-2026 | 07:10pm
హైదరాబాద్: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా టీజర్ విడుదలైంది. బ్రిటిష్ పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యంతో పాటు రాయలసీమలోని ఆధిపత్య పోరాటాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.