జియోహాట్‌స్టార్‌లో ‘రామాయణ’
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ ఓటీటీ భాగస్వామి ఖరారైనట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత జియోహాట్‌స్టార్ (JioHotstar)లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, పే-పర్-వ్యూ (Pay-per-view) విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఓటీటీ విడుదల తేదీ, పే-పర్-వ్యూ విధానంపై అధికారిక ప్రకటన (Official Announcement) వెలువడాల్సి ఉంది.