గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
- పారిశ్రామిక పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
- గిరిజన యువతకు ఉపాధి అవకాశాలపై చర్చ
- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట, అక్టోబర్ 22, (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ(Legislative Assembly Member Jare Adinarayana) అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వంటి గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ సెమినార్ లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ప్రస్తావించారు. గిరిజన ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవడం విద్యా, వైద్య సేవలు మరింత చేరువ కావడం, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. పారిశ్రామిక పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు,
స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన కూడా ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం అవసరం అన్నారు.
గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు...
గిరిజన యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం అని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించడం, పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడం,
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా యువత భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ సెమినార్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొనడంతో పలు రంగాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశం ఏర్పడింది.