తెలంగాణకు మోదీ, అమిత్ షా
తెలంగాణకు మోదీ, అమిత్ షా.. వరుస పర్యటనలపై ఆసక్తి!
న్యూఢిల్లీ: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పెద్దల పర్యటనలపై ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) డిసెంబర్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వరంగల్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్(Warangal Railway Manufacturing Center)తో పాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను జాతికి అంకితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) నవంబర్‌లో తెలంగాణకు రానున్నట్లు సమాచారం. వరుసగా ఇద్దరు కీలక నేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నారన్న వార్త రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ రైల్వే తయారీ కేంద్రం, కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లకు సంబంధించిన కార్యక్రమాలపై అధికారిక ప్రకటన వెలువడితే పర్యటనల షెడ్యూల్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.