పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
సాయన్న జయంతి వేడుకలలో : ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్, జోరుక సదయ్య
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 22 ( విజయక్రాంతి ) : డిసెంబర్ 10 పండుగ సాయన్న జయంతి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్, జోరుక సదయ్యలు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ను(District Additional Collector Ashok Kumar) కోరారు.
అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సాయన్న 1852 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం, మెలుగోరిపల్లి గ్రామంలో పండుగ సాయమ్మ అనంతయ్య ముదిరాజ్ లకు జన్మించాడని తెలిపారు.
13వ ఏటనే పెత్తందారి వ్యవస్థపై బలహీనవర్గాలలో వారు చేస్తున్న అక్రమాలపై తిరుగుబాటుతనాన్ని తన చిన్న వయసులోనే ఎంచుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బలహీన వర్గాలకు తోడుగా1865, 1900 సంవత్సరాలలో అనేక ఉద్యమాలు చేశాడని తెలిపారు. ప్రజల్లో సాయన్నకు వస్తున్న పేరును చూసి ఓర్వలేక తన 40వ యేట వందల మంది రజాకార్లు చుట్టుముట్టి సాయన్నను హతమార్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.