ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు

22-10-2026 | 05:06pm

పేదలు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు..

ఆలేరు,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న 174వ జయంతి వేడుకల(Panduga Sayanna 174th Jayanti Celebrated)ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు(Additional Collector Bhaskar Rao) ముఖ్య అతిథిగా హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, పేదలు, బలహీన వర్గాల ప్రజల కోసం పండుగ సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి, సమాజం పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు