పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్లైన్ ఓపెన్ హౌస్
టేకులపల్లి, (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College, Tekulapalli) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ఆన్లైన్ ద్వారా వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు శాఖలో వినియోగించే ఆయుధాలు, పరికరాలు, పోలీసుల విధులు, ప్రజలకు అందించే సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి అధికారులు వివరించారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేస్తూ, దేశం పట్ల అంకితభావం, సేవా దృక్పథం అలవర్చు కోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పవన్‌కుమార్, టేకులపల్లి ఎస్ఐ టి. తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బానోత్ బాబురావు, స్టూడెంట్ కౌన్సిలర్ ముంతాజ్ అలీ, అధ్యాపకులు బసవమ్మ, సత్యవతి, శంకరరావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, యాకూబ్, వరలక్ష్మి, ప్రమోద్‌కుమార్, నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.