యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

22-10-2026 | 05:05pm

జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి

చివ్వెంల,(విజయక్రాంతి): యాసంగి సీజన్‌(Yasangi Season)లో నీటి వినియోగాన్ని తగ్గించి, శనగ, పెసర, మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి(District Agriculture Officer G. Sridhar Reddy) సూచించారు. గురువారం చివ్వెంల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం(Khet Bachao Abhiyan program)లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతున్నందున భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగి నీటిమట్టాలు తగ్గుతున్నాయని తెలిపారు. రానున్న యాసంగిలో ఎల్‌నినో(El Niño) ప్రభావంతో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి వ్యవసాయ అధికారుల సూచనలతో పంటలను ఎంపిక చేసుకోవాలని, భూసారాన్ని కాపాడుకుంటూ సాగు ఖర్చులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి టి. నాగయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి పి. దామోదర్, మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, మార్కెట్ సెక్రటరీ ఎం.డి. ఫసియుద్దీన్, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ. కిరణ్, డివిజన్ ఉద్యాన శాఖ అధికారి స్వాతి, పీఏసీఎస్ సెక్రటరీ శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సరిత, శ్రీశైలం, ఉద్యాన విస్తరణ అధికారి సుధాకర్ రెడ్డి, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ భవిష్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు