మా భద్రమల్లడి మీద ఆన..
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘రణబాలి(Ranabali)’. ఈ సినిమాలో ఆర్నాల్ వోస్లూ(Arnold Vosloo) ప్రతినాయక పాత్రలో అలరించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోందీ చిత్రం.
బుధవారం ఈ మూవీ టీజర్ విడుదలైం ది. విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోం దీ టీజర్. ‘శింగనమల బొబ్బిలి రణబాలిరా నీ..క్కా’ అంటూ పౌరుషంగా సమాధానం ఇచ్చే డైలాగ్, ‘ఆ కొండపైనున్న మా భద్రమల్లడి మీద ఆన.. నేను కాయలి కాసాండంగా, ఒక్క మెతుకు గూడ పొలిమేర దాటదు చెప్తన్నా..’ అంటూ రణబాలి పాత్రలో విజయ్ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
మొత్తగా ఈ చిత్రంతో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్; డీవోపీ: నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ; యాక్షన్ కొరియోగ్ర ఫీ: యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం.
ఇవి కూడా చదవండి:
సమాజం అసలు రూపాన్ని ప్రశ్నించే కథ!