ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి

10-09-2026 | 05:56pm

నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగలిగిద్ద మండలం(Nagalgidda Mandal)లోని ప్రతి గ్రామంలో జాబ్‌కార్డు ఉన్న కుటుంబాలు తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheshwara Rao) గురువారం తెలిపారు. ఇంకుడు గుంత ఏర్పాటుకు రూ.6,500, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌కు రూ.34,000 వరకు నిధులు అందనున్నట్లు పేర్కొన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాలు(Groundwater) పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసుకుని నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. పనులకు సంబంధించిన నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని ఎంపీడీవో కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని, “ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత.. ప్రతి గ్రామానికి నీటి భద్రత” అనే సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు