ప్రశ్నిస్తే చంపేస్తారా..?

10-09-2026 | 03:39pm

అధికార పార్టీ నాయకుడి అనుచరుల దౌర్జన్యంపై గ్రామస్తుల ఆగ్రహం

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల(Tirumalayapalem Mandal) పరిధిలోని సుబ్లేడు గ్రామంలో డ్రైనేజీ పునరుద్ధీకరణ (వెడల్పు) పనుల్లో వివక్షను ప్రశ్నించినందుకు మెట్టు శ్రీనుపై అసభ్య పదజాలంతో దూషణలు, బెదిరింపులు ప్రజాస్వామ్య దేశంలో సమస్యలపై ప్రశ్నించే హక్కు సామాన్య పౌరుడికి లేదా అంటూ సుబ్లేడు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్లేడు గ్రామంలో జరుగుతున్న డ్రైనేజ్, రోడ్డు వెడల్పు పనుల్లో అధికార పార్టీ కి సంబంధించిన గంధసిరి నవీన్ దౌర్జన్యంగా వ్యవహరించారంటూ స్థానికుడు మెట్టు శ్రీనివాస్ ఆరోపించారు.

రోడ్డు వెడల్పు పనుల కోసం తొలుత 25 అడుగులుగా నిర్ణయించగా, ఇళ్లు కోల్పోతామని గ్రామస్తులు విజ్ఞప్తి చేయడంతో 20 అడుగులకు కుదించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో సమానంగా కాకుండా కొందరికి అనుకూలంగా పనులు జరుగుతున్నాయంటూ శ్రీనివాస్ సోమవారం కాంట్రాక్టర్‌ను వివరణ కోరినట్లు తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గంధసిరి నవీన్ తనపై దురుసుగా ప్రవర్తిస్తూ ఒక దళితునిపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని శ్రీనివాస్ ఆరోపించారు.

ప్రశ్నించే హక్కు లేదంటూ తనను పలు రకాలుగా అవమానించారని, ప్రజాస్వామ్యంలో న్యాయం అడిగినందుకు బెదిరింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని సామాన్య దళితుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పక్షపాతం లేకుండా గ్రామం మొత్తం నిర్ణయించిన 20 అడుగుల మేరకు రోడ్డు పనులు చేపట్టాలని, బెదిరింపులకు పాల్పడటం ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితగిన తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు