ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం
10-09-2026 | 05:50pm
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గురువారం ఢిల్లీ బయలుదేరింది. బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి ఢిల్లీ వెళ్లారు. రేపు జాతీయ మహిళా కమిషన్(National Commission for Women) ను, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission of India)ను కలవనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) సందర్భంగా అసెంబ్లీ వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరించనున్నారు.