దీపావళికి సీన్
సూర్య(Surya) జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘కరుప్పు(Karuppu), ‘విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath & Sons)’ విజయాలు అందుకున్న ఆయన మరో సినిమాతో రాబోతున్నారు. ఇప్పటివరకు ‘సూర్య47’ అనే వర్కింగ్ టైటిల్(Working Title)తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్ లాక్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
జీతూ మాధవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా.. ఇందులో నజ్రియా కథానాయిక. నస్లెన్, ఆనంద్రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జితు మాధవన్ మలయాళంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న సూర్య లుక్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతోంది.
ఇవి కూడా చదవండి: