శ్రీ చైతన్య పాఠశాలకు ఇరవై రోజుల డెడ్‌లైన్
అనుమతులు తెచ్చుకోకుంటే 8, 9 తరగతులు రద్దు...
తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి ఎంఈవో స్పష్టమైన ఆదేశాలు
బాన్సువాడ, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో( Sri Chaitanya School) 8, 9 తరగతులకు సంబంధిత అనుమతులు పొందకపోతే తరగతులను కొనసాగించేందుకు అనుమతి ఉండదని ఎంఈవో నాగేశ్వర్‌రావు(MEO Nageswara Rao) స్పష్టం చేశారు. 20 రోజుల్లోగా అవసరమైన అనుమతులు పొందాలని పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై(future of education) ప్రభావం పడే అవకాశం ఉన్నందున నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, యాజమాన్యానికి ఆదేశించారు.నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడంలో విఫలమైతే 8, 9 తరగతులను రద్దు చేస్తామని ఎంఈవో నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే విద్యాశాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.