తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం ఆలయ అధికారులు ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని(Lord of Tirumala) 77,670 మంది భక్తులు దర్శించుకోగా, 33,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల వసతి వివరాలు : CRO తిరుమల
10 సెప్టెంబర్ 2026 | ఉదయం 7:23 గంటలకు
రూ.50 & రూ.100: 638 అందుబాటులో ఉన్నాయి / మొత్తం 1,300
రూ.1,000 & రూ.1,523: ఏవీ అందుబాటులో లేవు
అందుబాటులో ఉన్న గదుల వివరాలు మారవచ్చు. ఒరిజినల్ లేదా ప్రింటెడ్ ఆధార్‌ను వెంట ఉంచుకోండి.
TTD కాల్ సెంటర్: 155 257