ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో శుద్ధి
- కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆందోళన
కాంగ్రెస్ తీరును ఖండిస్తూ శుద్ధి
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
గజ్వేల్/జగదేవపూర్, సెప్టెంబర్9: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు (Congress cadres) చేసిన యత్నాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేప ట్టారు. వరదరాజ్‌పూర్, ఎర్రవల్లి గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన ప్రాంతా ల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అనంతరం ఎర్రవల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మా ట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌ను అవమానించేలా కాంగ్రె స్ శ్రేణులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉం డాలని కోరుకోవాల్సింది పోయి ఆయన చా వును కోరడం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను తన వద్దే ఉంచుకుని పోలీసు బలగాలను ఉపయోగిస్తూ కాం గ్రెస్ శ్రేణులను ఫామ్‌హౌస్ ముట్టడికి ప్రోత్సహించడం దౌర్భాగ్యకరమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.