శాసనమండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్

10-09-2026 | 11:41am

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) నాలుగో రోజు కొనసాగుతున్నాయి. తెలంగాణ శాసనమండలిలో(Telangana Legislative Council) గందరగోళం నెలకొంది. BRS ఎమ్మెల్సీల పోడియం దగ్గరికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మండలి చైర్మన్ ప్లకార్డులు తీసేయాలని మార్షల్స్‌కు ఆదేశించారు. ఆగ్రహించిన బీఆర్ఎస్ సభ్యులు పోడియం దగ్గర పేపర్లు చింపిపైకి ఎగురవేశారు. అనంతరం శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్(BRS walk out) చేశారు. సభ జరుగుతున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్షల్స్ ద్వారా సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మధుసూదనా చారి ఆరోపించారు.

బీఆర్ఎస్ సభ్యులపై చైర్మన్ గుత్తా ఆగ్రహం

బీఆర్ఎస్ సభ్యులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేపదే జై తెలంగాణ అని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లోనే జై తెలంగాణ అని సాధించామన్నారు. ఇంకా ఎందుకు జై తెలంగాణ అంటున్నారని మండిపడ్డారు. మండలిలో 22ఏపై(22A) బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డటారు. వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు.


ఇవి కూడా చదవండి:

బయట బీఆర్ఎస్.. సభలోపల బీజేపీ రచ్చ.. సమయం వృథా

తెల్లారకముందే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

అసెంబ్లీలో ‘ఏలేటి’ వ్యాఖ్యల దుమారం

మరిన్ని వార్తలు