చంద్రహాస్ కోట్ల హీరోగా సినిమా ప్రారంభం
చంద్రహాస్ కోట్ల(Chandrahass Kotla) హీరోగా కే రాఘవేంద్రరెడ్డి(K. Raghavendra Rao) సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేశ్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ స్క్రిప్ట్ అందజేయగా, దీపా ఆరట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ చిత్రానికి శివా రెడ్డి ఎస్వీ కెమెరామెన్‌గా, మారుతీ రాజా సంగీత దర్శకుడిగా, డీ వెంకట ప్రభు ఎడిటర్‌గా పనిచేయనున్నారు.