థ్రిల్ చేసే ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మయూఖ’(Mayookha). ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీతేజ్ ఎస్‌కే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మురళీధర్‌గౌడ్, అమన్ మసూద్, దేవ్ డీ, లావణ్య రాణి, చరిష్మా దబ్బార, జానువర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, వీఎస్ రాజు, మది నస్రీన్, బేబి మాన్వీ, మాస్టర్ షణ్ముఖ చరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం హైదరాబాద్ లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయకి పాయల్ చెంగప్ప మాట్లాడుతూ.. “మయూఖ’ ఫీమేల్ ఒరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ కథ వింటున్నంత సేపూ థ్రిల్ ఫీల్ కలిగింది. కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా స్పందిస్తునేది గూస్‌బంప్స్ తెప్పించింది.
ఇవి కూడా చదవండి: బస్తీ బాయ్ లవ్‌స్టోరీ ప్రారంభం
ప్రేక్షకులకూ కొత్త అనుభూతి కలిగిస్తుంది” అన్నారు. డైరెక్టర్ శ్రీతేజ్ మాట్లాడుతూ.. “తెలుగు చిత్రాల్లో ‘మయూఖ’ లాంటిది అరుదుగా వస్తుంది. హాలీవుడ్, కొరియన్ మూవీలా కలర్ గ్రేడింగ్ చేశాం. థియేటర్‌కు వెళ్తే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నా” అని తెలిపారు. నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ.. “కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ మా సినిమాలో ఉంది. అంతా ఆదరిస్తారని నమ్ముతున్నాం” అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు.