సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

24-11-2026 | 07:12pm

గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్ అర్బన్ నవంబర్ 24 (విజయక్రాంతి): ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, టిపిసిసి ఆదేశాల మేరకు ఈ నెల 26న హైదరాబాద్ లో జరిగే  సంవిధాన్ రక్షా మార్చ్(Samvidhan Raksha March) కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా డివిజన్ అధ్యక్షులు డిసిసి కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.ఎఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26 న హైదరాబాద్ లో బారి ర్యాలీ నిర్వహించనున్నారని వజ్రేష్ యాదవ్ వెల్లడించారు.

అదేవిధంగా లిబర్టీ సర్కిల్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.రాజ్యాంగ పరిరక్షణ,ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన సంవిధాన్ రక్షా మార్చ్ ను విజయవంతం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిసిసి మాజి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్.కుత్బుల్లాపూర్  మాజి ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి.సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్సింహ యాదవ్.డిసిసి కార్యవర్గ సభ్యులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు