షాపులో చోరీ.. నిందితుడి అరెస్ట్
4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
మేడిపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి): జువెలరీ షాపులో బంగారు చెవి రింగులను చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న సాయంత్రం బోడుప్పల్‌లోని వీరారెడ్డి నగర్ ఎక్స్‌రోడ్డులో ఉన్న రాందేవ్ జువెలరీ షాపు(Ramdev Jewelry Shop)నకు వచ్చిన ఓ వ్యక్తి, యజమాని దృష్టిని మరల్చి బంగారు ఆభరణాలను అపహరించాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన శ్రీపతి నగేష్ (41)ను గుర్తించి అరెస్ట్ చేశారు.అతడి వద్ద నుంచి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. జువెలరీ షాపుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి సూచించారు.