న్యూసెన్స్‌కు పాల్పడిన వ్యక్తులకు స్వచ్ఛభారత్ పనిష్మెంట్

28-10-2026 | 09:02pm

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి  కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులను విచారించిన  న్యాయమూర్తి వారికి గంటసేపు స్వచ్ఛభారత్(Swachh Bharat) కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే ఈనెల 21న బి. నరేష్ (27), 24న జి. కరుణాకర్ (34), ఎం. శ్రీనివాస్ (36), మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూసెన్స్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరిచారు.

న్యాయమూర్తి వారికి గంటసేపు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌కు పాల్పడకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

మరిన్ని వార్తలు