ఆస్తి స్వాధీనం చేసుకున్న మేడిపల్లి పోలీసులు

30-09-2026 | 10:57pm

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipalli Police Station) పరిధిలో నమోదైన 9 దొంగతనం కేసుల(Theft Cases)కు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 2 లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడు బబ్లు పాశ్వాన్ (45) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాడు కాగా ప్రస్తుతం జీడిమెట్ల చింతల్ గణేష్ నగర్, షా సినిమా థియేటర్ వెనుక నివాసముంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు