ఈనెల 2న గ్రామసభలు నిర్వహించాలి
30-09-2026 | 11:01pm
వెంకటాపూర్,(విజయక్రాంతి): వీబీజీ రాం జీ పథకం(VB-G RAM G Scheme)లో భాగంగా ఈ నెల 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి కొత్త పనులను గుర్తించాలని ఎంపీడీఓ మూడు రాజు కోరారు. భూగర్భ జలాల(Groundwater) పెంపునకు పంట కాలువలు, రాతికట్టలు, ఫారం పాండ్లు, చెరువు పూడికతీత, ఇంకుడు గుంతలు, రీచార్జ్ గుంతలు, ట్రెంచ్ పనులను గుర్తించాలని తెలిపారు.
అలాగే పాఠశాల అదనపు గదులు, ప్రహరీలు, అంగన్వాడీ భవనాలు, కల్వర్టులు, బస్స్టాప్లు, సోలార్ లైట్లు తదితర పనులకు తీర్మానాలు చేయాలని సూచించారు. వ్యక్తిగత పనుల్లో పండ్ల తోటలు, పశు, గొర్రెల షెడ్లు, కూరగాయల పందిళ్లు, ఫారం పాండ్లు తదితర పనులను గుర్తించి, గ్రామసభ తీర్మానాలను సకాలంలో మండల కార్యాలయానికి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లను కోరారు.