కొత్త కలెక్టరేట్‌కు రేవంత్ రెడ్డి శ్రీకారం

30-09-2026 | 04:20pm

కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన పర్యటనలో పలు కీలక కార్యక్రమాలు జరిగాయి. జిల్లా పరిపాలనకు కొత్త రూపాన్ని తీసుకురావడంలో భాగంగా నిర్మించిన కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక సందడి నెలకొంది.

అదే పర్యటనలో జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపన సీఎం పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వార్తలు