ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌తో.. కాస్త జాగ్రత్త!

30-09-2026 | 06:04pm

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ డెలివరీ యాప్స్‌ (Instant Delivery Apps) ద్వారా ఫుడ్‌, కూరగాయలు, పాల ఉత్పత్తులు ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే డెలివరీ వచ్చిన తర్వాత వాటి నాణ్యత, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని ఫుడ్‌ సేఫ్టీ (Food Safety) అధికారులు సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పత్తర్‌గట్టి పాంజేషా రోడ్డులో ఉన్న ఓ ఇన్‌స్టాకార్ట్‌ (Instacart) గోడౌన్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలు గుర్తించారు.

తనిఖీల్లో ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలు (Expired Food Items), కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన పాల ప్యాకెట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గోడౌన్‌లోని ఫ్రిజ్‌లు (Fridges) కూడా అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత గోడౌన్‌ లైసెన్స్‌ (Licence) రద్దు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్‌ చేసే వినియోగదారులు డెలివరీ సమయంలోనే ప్యాకింగ్‌, ఎక్స్‌పైరీ తేదీ, ఉత్పత్తి నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో డెలివరీ అందుతుందన్న కారణంతో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడొద్దని హెచ్చరిస్తున్నారు.


మరిన్ని వార్తలు