గురువుల సేవలను విద్యార్థులు మరువలేరు

30-09-2026 | 11:27pm

బోథ్,(విజయక్రాంతి): గురువులు తమ గురుతర బాధ్యతలను మర్చిపోకుండా నిర్వహిస్తే వారి ద్వారా చదువు నేర్చిన విద్యార్థులు ఏనాడు మర్చిపోరని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం సోనాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సచిన్ దేశ్ముఖ్ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. అంతకుముందు పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయుడిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ గాజుల లక్ష్మి పి ఆర్ టి యు అధ్యక్షులు కొమ్ము కుమారులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు పాఠశాల అభివృద్ధి ఇంతగానో కృషి చేశారన్నారు. ఆయన సేవలు సోనాల ప్రజలు మర్చిపోరు అన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు