గోధుమల ఎంఎస్‌పీకి కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027–28 మార్కెటింగ్ ఏడాదికి గోధుమల కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ.25 పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ గోధుమల మద్దతు ధర రూ.2,610కు చేరింది. గోధుమలతో పాటు పప్పుధాన్యాల మద్దతు ధర (Support Price) పెంపునకు కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైతులకు మెరుగైన ధరలు అందించడంతో పాటు వ్యవసాయ రంగానికి (Agriculture Sector) ప్రోత్సాహం కల్పించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపింది.ట్రాఫిక్ నిర్వహణ, రద్దీ నియంత్రణ, సమస్యల గుర్తింపులో ఏఐ సాయం (AI Assistance) తీసుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు.