ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షనీయం

30-09-2026 | 11:18pm

దామన్న కుటుంబానికి దక్కిన గౌరవం సర్వోత్తమ్ రెడ్డి

సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ కొండ రాజు

తుంగతుర్తి,(విజయక్రాంతి): నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ కొండ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నిరుద్యోగ యువత కోసం పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి మద్దతుగా నిలిచి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు హెల్ప్ డెస్క్‌ను ప్రారంభిస్తున్నట్లు కొండ రాజు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా అర్హులైన గ్రాడ్యుయేట్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి హెల్ప్ డెస్క్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట యువజన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు