కేటీఆర్ గెలుపుపై రేవంత్ హాట్ కామెంట్స్
30-09-2026 | 07:55pm
సిరిసిల్ల: సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలన, కేటీఆర్ రాజకీయ ప్రస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల పేరు సిరులకు నిలయంగా ఉన్నప్పటికీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి భిన్నంగా మారిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2009లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి తొలిసారి పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ఆయన గెలుపుపైనా వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ కుటుంబం రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సిరిసిల్ల పర్యటనలో రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఇదిలా ఉండగా, సీఎం ఆరోపణలపై కేటీఆర్ గతంలో స్పందిస్తూ భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు.