మోహన్‌ హత్య కేసులో భార్య, కుమార్తె అరెస్టు

30-09-2026 | 10:55pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని అశోక్‌ రోడ్‌లో ఈ నెల 29న జరిగిన మోహన్‌ హత్య కేసు(Murder Case)లో అతడి భార్య జమున, కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టణ సీఐ ప్రమోద్‌రావు బుధవారం వెల్లడించారు. మోహన్‌, జమున మధ్య వివాహ సంబంధిత(Marriage related) మనస్పర్థలతో ఈ నెల 28న రాత్రి గొడవ జరిగినట్లు సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు తెల్లవారుజామున జమున, ఆమె కుమార్తె కలిసి మోహన్‌పై రోకలిబండతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మోహన్‌ మృతిచెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు