నిండు జీవితానికి రెండు చుక్కలు

22-11-2026 | 05:54pm

నాగల్‌గిద్ద, నవంబర్ 22 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం, సూపర్‌వైజర్ విక్టోరియా రాణి వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు (Polio Drops) వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని చిన్నారులకు ఈ నెల 23, 24 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు