ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా రూ.58 లక్షల బీటీ రోడ్డు పనుల ప్రారంభం

22-09-2026 | 02:31pm

ఉప్పల్ సెప్టెంబర్ 22 విజయక్రాంతి : ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ స్నేహపురి కాలనీ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy) అన్నారు. కాలనీలోని మెయిన్ రోడ్డుపై రూ.58 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.

పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహపురి కాలనీ అధ్యక్షుడు ఎం. భూపాల్ రెడ్డి, అడ్వైజర్ డా. కే.జే.ఎన్. రెడ్డి, ఉపాధ్యక్షుడు యాదవ రెడ్డి, ఖజాంచి బి. వెంకటస్వామి, సభ్యులు శ్రీకర్ రెడ్డి, జ్ఞానస్వరూప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్, సోమశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు