పరిశుభ్రతపై సిబ్బందికి అభినందనలు

22-09-2026 | 02:42pm

నాగల్‌గిద్ద పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ పరితోష్ పంకజ్ 

నాగల్‌గిద్ద, సెప్టెంబరు 22 (విజయ క్రాంతి): నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మోర్గి చౌరస్తాలో గల నాగల్‌గిద్ద పోలీస్‌ స్టేషన్‌ను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్(Sangareddy District SP Paritosh Pankaj) తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, వారి విధుల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. స్టేషన్‌ పరిసరాల్లో పరిశుభ్రతను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నారాయణఖేడ్‌ ఎస్సై శ్రీశైలం, నాగల్‌గిద్ద ఎస్సై రామకృష్ణ, ఏఎస్సై రవీందర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు