మహమ్మదాబాద్ లో ఖోఖో క్రీడా పోటీలు
జుక్కల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ ప్రభుత్వ పాఠశాల(Mahammadabad Government Village School) ఆవరణలో మంగళవారం మండల స్థాయి క్రీడ పోటీల్లో భాగంగా ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా జెడ్పి సీఈవో చందర్ నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో పోటీపడినట్లే క్రీడల్లో కూడా పోటీపడి క్రీడలను ఆస్వాదించాలని అన్నారు. దీంతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని విద్యార్థులకు సూచించారు.
చదువు కూడా అతి ముఖ్యమని పేర్కొన్నారు. చదువుతూ క్రీడలను ఆడాలని సూచించారు. ఇందులో ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులు పాల్గొని ఖోఖో పోటీలు ఆడారు. ఈ పోటీలు యుపిఎస్ స్థాయి విద్యార్థు లకు నిర్వహించినట్లు ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. పాఠశాల హెచ్ఎం గోపాల్ మాట్లాడుతూ మండల స్థాయి పోటీలు నిర్వహించడం తమ పాఠశాల సిబ్బంది అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునంద, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, లాలయ్య, జనార్ధన్, శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.