శాఖల పనితీరుపై సర్పంచుల నిలదీత

22-09-2026 | 03:13pm

ఉట్నూర్, సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి ): సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని, గ్రామాల్లో ఏ సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తేవాలని ఉట్నూర్ మండల ప్రత్యేక అధికారి ఐటీడీఏ డిడి జి అశోక్ గౌడ్(ITDA DD G. Ashok Goud) అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశం ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, అటవీశాఖల ప్రస్తావన రాగా అటవీ అధికారులు పంచాయతీలోని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఆత్రం తిరుపతి, చెరువు గూడ సర్పంచ్ భగవంతరావు అధికారులకు ప్రశ్నించారు.

దీంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొలం గిరిజనులకు మంజూరు చేసిన  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు  గుంతల కే  పరిమితమైనట్లు  సర్పంచులు వాపోయారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కల్పించుకొని పనులు జరిగేలా సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఇంద్ర క్రాంతి పథకం ద్వారా 10 గ్రామైక్య సంఘాల కు భవనాల నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా.. భవనాలను నిర్మించుటకు  స్థల సేకరణ కోసం సర్పంచులు సహకరించాలని ఏపీఎం రామారావు కోరారు. వివిధ శాఖల అధికారులు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించగా పలు సమస్యలపై సర్పంచులు ప్రస్తావనకు తెచ్చారు.

అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు వివరాలను సర్పంచ్లకు తెలపాలని  కోరారు. పనులు అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులు మండల స్థాయి సమావేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు. వచ్చే సమావేశానికి అటవీ శాఖ ఉన్నత అధికారి పాల్గొనేలా చూడాలని సర్పంచులు డిమాండ్ చేశారు.

గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని మత్తడిగూడ ఇతర గ్రామపంచాయతీలో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం 200 యూనిట్ల కు వాడుకున్న వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మహమ్మద్ రాయిస్ ఉల్లా, డి ఎల్ పి ఓ ప్రభాకర్, తాహసిల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, వి బిజీ రాంజీ ఏపీవో రజినీకాంత్, ఉద్యానవన శాఖ అధికారి మహేందర్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ , వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు