గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ మట్టా దయానంద్

22-09-2026 | 02:27pm

సత్తుపల్లి. సెప్టెంబర్. 22.( విజయ క్రాంతి ): సత్తుపల్లి నియోజకవర్గంలోని (Sathupalli Constituency) వేంసూరు మేజర్ గ్రామంతో పాటు తల్లాడ మండలంలోని నూతనకల్, మిట్టపల్లి, బిల్లుపాడు గ్రామాల్లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు గణపతి మండపాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Dr. Matta Dayanand Vijay Kumar) సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా గణపతి మండపాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పలు గణపతి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఫక్రుద్దీన్, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు