అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
చేగుంట నవంబర్ 22,విజయక్రాంతి : చేగుంట పట్టణ(Chegunta town) కేంద్రంలోని శ్రీ ధనలక్ష్మి హార్డ్వేర్ షాపులో(Sri Dhanalakshmi Hardware Shop) చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై(Fire incident) దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Dubbak MLA Kotha Prabhakar Reddy) స్పందించారు. మంగళవారం అగ్నిప్రమాదం(Fire accident) జరిగిన షాపును సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు, బాధితులను కలిసి ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు ధైర్యం చెబుతూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.